కర్నూలులో భారీ వర్షం

25 Sep, 2019 18:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు: జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం పలు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో.. ప్యాపిలిలోని వాగులు పొంగిపోర్లుతున్నాయి.  అదేవిధంగా మర్లేమడికి వద్ద వేదావతి నది పోంగిపొర్లుతోంది. వరద ప్రవాహం కారణంగా ఏపీ- కర్ణాటక మధ్య ఉన్న రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వందల ఎకరాల్లోని పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరి, పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పీఆర్‌పల్లి వాగు వరద ఉధృతికి రహదారి తెగిపోయింది. 

మరిన్ని వార్తలు