రొట్టెల పండుగకు పోటెత్తిన భక్తులు

18 Nov, 2013 01:36 IST|Sakshi

 నెల్లూరు, న్యూస్‌లైన్ : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగకు ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు కడప పీఠాధిపతి నేతృత్వంలో బారాషహీదులకు వైభవంగా గంధమహోత్సవం నిర్వహించారు. అనంతరం గంధాన్ని స్వర్ణాల చెరువులో కలిపి రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కోరికలు తీరి మొక్కు తీర్చుకునేవారు, కోరికలు కోరుకునేవారు పరస్పరం రొట్టెలు మార్చుకునేందుకు పోటీపడ్డారు. శనివారం రాత్రి నుంచి వాయుగుండ ప్రభావంతో వర్షం పడుతున్నా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపార రొట్టెల వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. రొట్టె పట్టుకున్న అనంతరం బారాషహీదుల దర్శనం కోసం బారులు తీరారు.   
 

మరిన్ని వార్తలు