పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్‌ పాడు చేసుకుంటున్నారు: ఎమ్మెల్యే అనిల్

14 Aug, 2023 12:08 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరులో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అనిల్ ఫైరయ్యారు. పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్‌ పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఫ్యూచర్‌కే క్లారిటీ లేదు.. మీకు ఆయన ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు.

మహిళ శక్తిపై టీడీపీ చేస్తున్న ప్రచారాలపై ఎమ్మెల్యే అనిల్ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి అంటూ తిరిగే టీడీపీ నేతలకు చిత్త శుద్ది లేదని విమర్శించారు.  మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కత్తితో మహిళపై దాడి చెయ్యడమేనా మహిళా శక్తి అంటే..? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్‌ దాడి

మరిన్ని వార్తలు