గుర్తుకొస్తున్నాయి...

23 Feb, 2014 00:42 IST|Sakshi
గుర్తుకొస్తున్నాయి...

  న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీజేజస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా


 హైదరాబాద్, న్యూస్‌లైన్: క్రికెట్ స్ఫూర్తిదాయకమైన ఆట అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అన్నారు. శనివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంతమంది లాయర్లు క్రికెట్ ఆడటం చూస్తుంటే.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయన్నారు. నిత్యం కోర్టుల్లో వాదనలతో సతమతమయ్యే న్యాయవాదులు నిజజీవితంలో ఆదర్శంగా ఉంటారన్నారు. చీఫ్ జస్టిస్-11, ప్రెసిడెంట్స్-11 జట్ల మధ్య జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీల్లో చీఫ్ జస్టిస్ జట్టు విజయం సాధించింది. చీఫ్ జస్టిస్-11 జట్టుకు జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా సారథ్యం వహించగా, ప్రెసిడెంట్స్-11 జట్టుకు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గిరిధర్‌రావు సారథ్యం వహించారు. కార్యక్రమంలో జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు సీనియర్ న్యాయవాదులు పాశం కృష్ణారెడ్డి, డీఎల్ పాండు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు