తెలుగు ప్రజల రక్తంతో విందులా?

12 Feb, 2014 15:41 IST|Sakshi
తెలుగు ప్రజల రక్తంతో విందులా?

తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ నాయకులతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విందు రాజకీయాలు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా ఆ పార్టీ అభిప్రాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల రక్తంతో మీరు విందులు చేసుకుంటారా అని నిలదీశారు.

రాష్ట్రాన్ని బలిపీఠంపై పెట్టారని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లు మంటల్లో కాంగ్రెస్ నాయకులు మాడి మాసైపోతారుని జూపూడి దుయ్యబట్టారు. అసలు రైల్వే బడ్జెట్‌ను 10 నిమిషాల్లో పూర్తి చేయడం ఎప్పుడైనా జరిగిందా అని ఆయన అడిగారు. ఒకవేళ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు