ఆపన్నులకు అండగా...

15 Oct, 2014 00:58 IST|Sakshi
ఆపన్నులకు అండగా...

 ఏలూరు : హుదూద్ తుపాను బీభత్సంతో అన్నపానీయూలు దొరక్క అలమటిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకునేందుకు ‘పశ్చిమ’ ప్రజలు మేము సైతం అంటూ ముం దుకు వస్తున్నారు. మంగళవారం రాత్రి వరకూ 1.61 లక్షల ఆహార పొట్లాలు, 7.37 లక్షల మంచినీటి ప్యాకెట్లను అధికారుల ద్వారా తుపాను బాధిత ప్రాంతాలకు పంపిం చారు. బుధవారం మరో 1.16 లక్షల ఆహార పొట్లాలు పంపుతున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయానికి 41,400, గన్నవరం విమానాశ్రయానికి 2,400, రోడ్డు మార్గం ద్వారా 1,17,470 ఆహార పొట్లాలను పంపించినట్టు వివరించారు.  వీటిలో తాడేపల్లిగూడెం నుంచి 12,500, తణుకు నుంచి 4,800, నిడదవోలు నుంచి 5,000, దేవరపల్లి నుంచి 4,000, తాళ్లపూడి నుంచి 5100 ఆహార పొట్లాలు అందాయని తెలిపారు.
 
 వీటిని ఆయూ మండలాల తహసిల్దార్ల ఆధ్వర్యంలో సమీకరించినట్టు తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో 12,400, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సహకారంతో 25 వేలు, జిల్లా పంచాయతీ అధికారి ద్వారా 2,400 ఆహార పొట్లాలను రోడ్డు మార్గంలో పంపించామన్నారు. వీటితోపాటు 10 టన్నుల కూరగాయలను కూడా పంపినట్టు పేర్కొన్నారు. నల్లజర్ల, ఏలూరు, తణుకు, పాలకొల్లు ప్రాంతాల నుంచి 7.37 లక్షల వాటర్ ప్యాకెట్లను, నిడదవోలు, ఏలూరు, భీమవరం నుండి 6 మంచినీటి ట్యాంకర్లను, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు నుంచి 33 వేల బిస్కెట్ ప్యాకెట్లను పంపించామన్నారు. ఏలూరు, ఆకివీడు, తణుకు నుంచి 16 జనరేటర్లను పంపుతున్నట్టు తెలిపారు.
 
 5 వేల లీటర్ల పాలు తరలింపు
 ఏలూరు నుంచి 5 వేల లీటర్ల పాలను, 25 వేల బిస్కెట్ ప్యాకెట్లు, లక్ష మంచినీటి ప్యాకెట్లతోపాటు పులిహోర, పలావ్ ప్యాకెట్లను విశాఖపట్నానికి పంపినట్టు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) చెప్పారు.
 
 విరాళాలు ఇవ్వాలనుకుంటే...
 తుపాను బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ 33913634404 (ఐఎఫ్‌ఎస్ కోడ్ నంబర్ : ఎస్‌బీఐఎన్ 0002724)కు సొమ్మును జమ చేయవచ్చని కలెక్టర్ కె.భాస్కర్ పేర్కొన్నారు. చెక్కులు, డీడీల రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు డెప్యూటీ సెక్రటరీ, రెవెన్యూ శాఖ, 4వ ప్లోర్, ఎల్-బ్లాక్, సెక్రటేరియట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలని సూచించారు. ఇదిలావుండగా, తుపాను బాధితుల సహాయూర్థం 17వ డివిజన్ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు, ఆర్‌ఎన్నార్ అధినేత నాగేశ్వరరావు రూ.3 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే బడేటి బుజ్జికి అందించారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ రూ.2 లక్షలు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి రూ.2 లక్షల విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు.
 

మరిన్ని వార్తలు