తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

13 Oct, 2019 20:56 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఓ వైపు దసరా సెలవులు ముగుస్తుండటంతో పాటు,  పెరటాసి నెల చివరి వారం కావడంతో తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం దాదాపు 26 గంటలకు పైగా సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్యా నడక దారిన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 

పెరటాసి మాసంలో శనివారం కావడంతో అక్టోబరు 12న 1,01,371 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. వెంకన్న దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు స‍్వామివారికి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. దేవదేవుడు గరుడ వాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.  కాగా ప్రతి నెలా పౌర్ణమి రోజు తిరుమలలో గరుడ సేవ జరగుతుంది.

మరిన్ని వార్తలు