పాదయాత్ర వీడియోలకు విశేష స్పందన

11 Nov, 2017 04:24 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ మీడియా ఫేస్‌బుక్‌ ముఖచిత్రం

ప్రతి వీడియోకు గంటకు సగటున 40 వేలమంది వీక్షకులు

వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ మీడియాతో అభిమానులకు చేరువ 

సాక్షి ప్రతినిధి, కడప/బద్వేలు: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసిన గంటల వ్యవధిలోనే వేల మంది, రోజు వ్యవధిలో లక్ష మందికిపైగా చూస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రను అభిమానులకు దగ్గర చేసేందుకు ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ మీడియా పేజీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతిరోజు పాదయాత్ర వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు ఇందులో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిని గంటల వ్యవధిలోనే వేలాది మంది తిలకిస్తున్నారు. రోజు వ్యవధిలో లక్షకు పైగా యాత్ర వీడియోలను తిలకిస్తున్నారంటే జగన్‌ యాత్రపై నెటిజన్లకు ఉన్న ఆసక్తి తెలుస్తోంది. గురువారం సాయంత్రానికి ఆయా వీడియోలకు లభించిన ఆదరణ ఇలా ఉంది. 

- పాదయాత్ర ముందు రోజు యాత్ర చేపడుతున్న కారణాలు, తాను ముందుకు సాగుతున్న అవసరాన్ని తెలియజేస్తూ పెట్టిన వీడియోను ఫేస్‌బుక్‌లో 2.65 లక్షల మంది నెటిజన్లు చూశారు.
- అదేరోజు వైఎస్‌ విజయమ్మ తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని అప్‌లోడ్‌ చేసిన వీడియోను 1.13 లక్షల మంది చూడటం విశేషం.
- యాత్ర ప్రారంభమైన సోమవారం రోజు తన తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి, అమ్మ ఆశీస్సులు తీసుకున్న జగన్‌ వీడియోకు 1.52 లక్షల మంది తిలకించారు.
- ఇడుపులపాయ వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగాన్ని 1.17 లక్షల మంది చూశారు.
- ఏడో తేదీన వేంపల్లెలో జగన్‌ సంకల్పయాత్రకు విపరీత స్పందన లభించింది. కేవలం గంటలోనే ఈ వీడియో 50 వేలమంది తిలకించగా గురువారం నాటికి 1.76 లక్షల మంది చూశారు.
- రచ్చబండను కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 75 వేలమంది నెటిజన్లు చూశారు.
- మూడో రోజు బుధవారం మధ్యాహ్నం వీరపునాయునిపల్లెలో జరిగిన బహిరంగ సభ ప్రసంగాన్ని అదే రోజు సాయంత్రానికే 60 వేలమంది నెటిజన్లు తిలకించారు. గురువారం సాయంత్రానికి ఈ సంఖ్య 1.09 లక్షలకు చేరింది. 
- ఆదే సభలో సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసిరిన వీడియోను ఇప్పటికే 1.86 లక్షల మంది తిలకించారు. 
- గురువారం ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు జగన్‌కు కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ వీడియోను సాయంత్రానికి 36 వేల మంది చూశారు. 
- ఎర్రగుంట్లలో జరిగిన భారీ బహిరంగ సభ వీడియోను 48 వేల మంది తిలకించారు. 
- ఫేస్‌బుక్‌తోపాటు ట్విట్టర్‌లో కూడా పాదయాత్ర విశేషాలను నెటిజన్లు తెలుసుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు