పురందేశ్వరి ఫిరాయింపు సిగ్గుచేటు

8 Mar, 2014 04:10 IST|Sakshi

అల్లిపురం : కేంద్రంలో మంత్రి పదవి అనుభవించిన పురందేశ్వరి పార్టీకి రాజీనామా చేసి మతతత్వ పార్టీలోకి మారడం సిగ్గుచేటని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

పురందేశ్వరి పార్టీ ఫిరాయించడంతో మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గంటా శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ పదవుల కోసం ఎన్ని పార్టీలైనా ఫిరాయిస్తారని విమర్శించారు. ఇలాంటి ఫిరాయింపుదారులను ప్రజలు, పార్టీల కార్యకర్తలు తరిమికొట్టే రోజు వస్తుందని చెప్పారు.

మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించినపుడే మహిళా దినోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు. మహిళల ప్రగతికి దోహదం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు విజయారెడ్డి, ప్రభాగౌడ్, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు