‘జన్మభూమి’లో ఉద్రిక్తత

2 Nov, 2014 02:03 IST|Sakshi
‘జన్మభూమి’లో ఉద్రిక్తత
  • ప్రొటోకాల్ పాటించని అధికారులు
  •  పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వని వైనం
  •  ఎమ్మెల్యే ఈశ్వరితో ఎంపీ గీత వాగ్వాదం
  • పాడేరు రూరల్: మండలలోని సలుగు, మోదాపల్లి పంచాయతీల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ రెండు చోట్లా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. సలుగు గ్రామం లో  పింఛన్ల పంపిణీ సమయంలో వీరిద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రొటోకాల్ ప్రకా రం ఎమ్మెల్యే చేత కూడా పింఛన్లు ఇప్పించాల్సి ఉన్నప్పటికి అధికారులు కేవలం ఎంపీ గీత, టీడీపీ నాయకుల చేత మాత్రమే పింఛన్లు పం పిణీ చేయించడంతో ఎమ్మెల్యే ఈశ్వరి ఇదేమి పద్ధతని అధికారులను నిలదీశారు.

    నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులచేత కూడా పింఛన్లు పంపిణీ  చేయించాలన్నారు. దీంతో తాము అధికార పార్టీకి చెందిన నాయకులమని, అన్ని చోట్ల తాము పింఛన్లను అందించేందుకు అర్హులమని తెగేసి చెప్పి ఎమ్మెల్యే, ఇతర వైఎస్సార్ నాయకులపై కొందరు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు  ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
     
    మోదాపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాడేరు ఎంపీపీ వి.ముత్యాలమ్మ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పింఛన్లలో కోత పెట్టడం సరైన పద్ధతి కాదని అనడంతో అక్కడ ఉన్న ఎంపీ కొత్తపల్లి గీత, ఇతర టీడీపీ నాయకులు ఆమెకు సమాధారం ఇవ్వకుండా వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లి గీతతో ఉన్న టీడీపీ నాయకులు   ఎంపీపీ, ఆమె వర్గీయులతో ఘర్షణ పడ్డారు. ఇక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్క దిద్దారు.

    జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల హవాపై ఆయా గ్రామాల గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పి.నూకరత్నం, మాజీ ఎంపీపీ రమణమూర్తి, వైఎస్సార్‌సీపీ నాయకులు వి.పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, తాజుద్దీన్, కె.చంద్రమోహన్‌కుమార్, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు