జూడాల ఆందోళన.. జీవో కాపీల దహనం

26 Nov, 2014 01:51 IST|Sakshi
జూడాల ఆందోళన.. జీవో కాపీల దహనం

తిరుపతి కార్పొరేషన్ : ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 107 ప్రతులను జూనియర్ డాక్టర్లు దాహనం చేశారు. జూనియర్ డాక్టర్లు చేపడుతున్న సమ్మెలో భాగంగా రెండవ రోజైన మంగళవారం రుయాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చారు. వీరికి సీనియర్ రెసిడెన్సీ డాక్టర్లు మద్దతు పలికారు. జూడాలు రుయా ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియం వరకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు.

మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ పైలాన్ వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు 107 జీవో నెంబరును తగలబెట్టారు. జూడా ప్రధా న కార్యదర్శి ఇజాజ్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఉనికికే ప్రమాదకరంగా మారిన ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. రూరల్ సర్వీసుకు తాము ఎంత మా త్రమూ వ్యతిరేకం కాదని, అయితే తమ ను శాశ్వత వైద్యులుగా నియమిస్తే పేదలకు అంకిత భావంతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూరల్ సర్వీసు చేయాలంటే అక్కడ రెసిడెన్సీ, నెలనెలా సరైన వేతనాలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. మరి అవి ఏవీ ఏర్పాటు చేయకుండానే సర్వీసు చేయమంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

ఇవి ఏవీ చేయనప్పుడు తమ చేత రూ.20 లక్షల బాండును ఎందుకు బలవంతంగా తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. పైగా మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామ్యం గా ఉన్నాయని, ఉద్యమాలను హేళన చేస్తే జూడాల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఇప్పటికైనా మంత్రి వ్యాఖ్యలు వె నక్కి తీసుకోవాలని, లేకుంటే నేటి నుం చి అత్యవసర సేవలను బంద్ చేసేం దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు