కారాగారం నుంచే కరోనాపై పోరు

9 Apr, 2020 12:34 IST|Sakshi

సాక్షి కడప :కరోనా వైరస్‌ నివారణలో మేము సైతం అంటూ కొందరు ఖైదీలు తమ వంతుగా సామాజిక సేవలో పాలుపంచుకుంటున్నారు. మాస్కుల కొరత వెంటాడుతున్న నేపథ్యంలో వీరు ముందుకు వచ్చి  పదుగురికీ సహకరిస్తున్నారు. కడపలోసెంట్రల్‌ జైలు నుంచి రోజూ మాస్కులను తయారు చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌ 18 కుట్టు మిషన్లను సమకూర్చారు. వాటిని కలుపుకుని 30 కుట్టు మిషన్ల ద్వారా ఛైదీలు మాస్క్‌ల తయారీకి శ్రమిస్తున్నారు.  రోజుకు 50 మంది ఖైదీ ఇందులో పాల్గొంటున్నారు.

కొంతమంది మిషన్‌ కుడుతుండగా, మరికొందరు ఇందుకు సంబంధించి చిన్న చిన్న పనులతో ఉడతా భక్తిగా వారికి తోడ్పడుతున్నారు. గతనెల 14 నుంచి మాస్క్‌ల తయారీకి వీరు శ్రీకారం చుట్టడం విశేషం. కలెక్టరేట్, డీపీఓ, డీఎంహెచ్‌ఓ, మున్సిపల్‌ కార్యాలయాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 49,500 మాస్క్‌లు కావాలని కారాగారానికి ఆర్డరు వచ్చింది.  రోజూ2500 నుంచి 3000 మాస్క్‌లను తయారు చేస్తున్నారు. సామాజిక దృక్ఫథంతో వీరు చేస్తున్న సేవకు అందరూ ఖైదీలవ్వాల్సిందే    

మరిన్ని వార్తలు