రాజధాని ప్రాంతంలో భూముల పరిరక్షణ కమిటీ పర్యటన

10 Nov, 2014 17:44 IST|Sakshi
అంబటి రాంబాబు

హైదరాబాద్: ఏపి రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో వైఎస్ఆర్ సిపి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన భూముల పరిరక్షణ కమిటీ పర్యటిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని భూముల వ్యవహారంపై  పరిరక్షణ కమిటీ చర్చించినట్లు తెలిపారు. కమిటీ రాజధాని భూసేకరణ గ్రామాలలో పర్యటిస్తుందని చెప్పారు.

రైతులు, కూలీల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. అభిప్రాయ సేకరణ తరువాత కమిటీ మళ్లీ సమావేశమవుతుందని చెప్పారు. భూసేకరణపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడమే మొదటి పనని అన్నారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు, ప్రజలు, కూలీల హక్కులు కాపాడాలన్నదే తమ ధ్యేయం అన్నారు. కమిటీలోకి అదనంగా మరో నలుగురిని తీసుకున్నట్లు అంబటి చెప్పారు.
**

మరిన్ని వార్తలు