లారీ, బైక్ ఢీ : ఇద్దరికి తీవ్రగాయూలు

19 Jun, 2015 02:19 IST|Sakshi

నేలకొండపల్లి : బైక్‌ను లారీ ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా లారీ పల్టీ కొట్టింది. ప్రత్యక్ష సాక్షి కథనం... ఏపీ, గుంటూరు జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన షేక్ సుభాన్, కృష్ణ జిల్లాలోని పెనుగ్రంచిపోలుకు చెందిన షేక్ జానీపాషా బైక్ పై గురువార ం ఖమ్మం బయలుదేరారు. మండల కేంద్రంలోని కట్టలమ్మ చెరువు దాటుతుండుగా ఖమ్మం నుంచి కోదాడ వస్తున్న బొగ్గు లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుభాన్, జానీ పాషాలు కిందపడి పోయారు.ఈ క్రమంలో లారీ పల్టీ కొట్టి పొలాలలో పడి పోయింది. బైక్ మాత్రం నుజ్జునుజ్జరుుంది. దీంతో బైక్‌పై ఉన్న సుభాన్, జానీ పాషా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా అరగంట వరకు 108 సంఘటన స్థలానికి రాలేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హెడ్ కానిస్టేబుల్ శంకర్‌రావు సంఘటన స్థలానిన సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.దేవేందర్‌రావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు