గంగరాజు పాలకోవా ఇష్టం: గీతామాధురి

10 Dec, 2017 10:52 IST|Sakshi

గాయని గీతామాధురి

రాజమహేంద్రవరం సిటీ: సినీ నేపథ్య గాయకులు  గీతామాధురి, అనుదీప్‌దేవ్‌ శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర ప్రజలను ఉర్రూతలూగించారు. ఆఫీసర్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ రేడియోమిర్చి 98.3 ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘లైవ్‌ ఇన్‌ కన్సర్ట్‌ ’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హుషారైన సినిమా పాటలతో ఆలరించారు. కార్యక్రమానికి అసోసియేట్‌ స్పాన్సర్‌గా కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ వ్యవహరించగా మీడియా పార్టనర్‌గా ‘సాక్షి మీడియా’ వ్యవహరించింది.

రోజ్‌మిల్క్, గంగరాజు పాలకోవా ఇష్టం : గీతామాధురి
రాజమహేంద్రవరం తనకు ఇష్టమైన ఊరు. ఇక్కడ రోజ్‌మిల్క్, గంగరాజు పాలకోవాలంటే చాలా ఇష్టం. మాది పశ్చిమగోదావరి జిల్లా కావడంతో పక్కనే ఉన్న రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందరు సంగీత దర్శకుల వద్ద పనిచేసి గాయనిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది.

70 పాటలు పాడా : అనుదీప్‌ దేవ్‌
ఉయ్యాలజంపాల, సినిమా చూపిస్తా మావా, పిల్లా నువ్వులేని జీవితం, ఇటీవల విడుదలైన ఖాకీ చిత్రాల్లో నేను పాడిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 2013లో గాయకుడిగా అవతారమెత్తి ఇప్పటివరకూ 70 చిత్రాల్లో 70 పాటలు పాడాను. రాజమహేంద్రవరం ఇప్పటికి చాలాసార్లు వచ్చాను. హైదరాబాద్‌ నా సొంతూరు. ఏవిధమైన సంగీత వాయిద్య పరికరాలు వినియోగించకుండా గొంతుతో ‘‘ఆకపెల్లా’’ పక్రియలో ఇప్పటి వరకూ అనేక పాటలు పాడాను.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా