వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

18 Feb, 2015 04:51 IST|Sakshi
వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

న్యూస్ నెట్‌వర్క్:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళశారం వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామాల్లో భక్తజనం పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ ైశె వక్షేత్రమైన కీసరగుట్ట, వరంగల్ జిల్లా హన్మకొండలోని చారిత్రక వేరుుస్తంభాల రుద్రేశ్రాలయం, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వరాలయం, కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి.
 
  రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సుమారు నాలుగు లక్ష మంది తరలివచ్చారు. స్వామి వారికి ప్రభుత్వం తరపున కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమానికి సీఎం లేదా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటెల రాజేందర్ హాజరవుతారని ప్రకటించినప్పటికీ వారు రాలేదు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు వేములవాడ రాజన్నను దర్శించుకుంటే తిరిగి ఎన్నికల్లో గెలువరనే ప్రచారం ఉంది. పదవులు కాపాడుకునేందుకే సీఎం, మంత్రులు వేములవాడను విస్మరించారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ ైశె వక్షేత్రమైన కీసరగుట్టలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు