అంగరంగ వైభవం.. రాజా, రాజిల వివాహం..

7 Mar, 2015 01:24 IST|Sakshi
అంగరంగ వైభవం.. రాజా, రాజిల వివాహం..

కళకళలాడిన ఆర్ట్స్ కళాశాల మైదానం
వధూవరుల్ని ఆశీర్వదించిన ప్రముఖులు
 

వరుడు జక్కంపూడి రాజాను ఆశీర్వదించిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జక్కంపూడి విజయలక్ష్మి, సింధుసహస్ర, కొత్తపల్లి భుజంగ రాయుడు, సుబ్బారాయుడు తదితరులు (అంతర చిత్రం) వధూవరులను అభినందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్
 
మాజీమంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల పెద్ద కుమారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజాకు, ద్రాక్షారామ వాస్తవ్యులు గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె రాజశ్రీ(రాజీ)తో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వరుడు రాజాను ఆయన నివాసంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వేలాదిగా ప్రజానీకం హాజరయ్యారు.
 
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :  మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిల జ్యేష్టకుమారుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, ద్రాక్షారామ వాస్తవ్యులు గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె రాజశ్రీల వివాహం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. అలనాటి సంప్రదాయాలను గుర్తుకు తీసుకువచ్చేలా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపై రాజా, రాజి వివాహబంధంతో ఒక్కటయ్యూరు. వరుడు రాజా ఇంటి నుంచి గుర్రపుబగ్గీపై ఊరేగింపుగా  కల్యాణవేదికకు చేరుకోగా, ఆయన వెంట ఎద్దుల బండ్లపై పెండ్లి సామాన్లు తీసుకు వచ్చారు. పెండ్లికుమార్తె రాజశ్రీని పల్లకిలో ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తోడుకుని వచ్చారు. వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, ఆత్మీయబంధుమిత్రులు వివాహ వేడుకకు హాజరై నవవధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వివాహానికి వచ్చిన జనవాహినితో కళాశాల మైదానం కిక్కిరిసింది.
 

ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జక్కంపూడి వారి ఇంటికి చేరుకుని వరుడు రాజాను అక్షింతలు వేసి ఆశీర్విదించారు. ఆయన సుమారు గంటపాటు జక్కంపూడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్  సీపీ నేతలు విజయసాయిరెడ్డి, షర్మిల, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బ్రదర్ అనిల్‌కుమార్, వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొత్తపల్లి సుబ్బారాయుడు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామినాయుడు, ఉండవల్లి అరుణకుమార్, బుచ్చిమహేశ్వరరావు, జి.వి.హర్షకుమార్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ళనాని, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, గ్రంధి శ్రీ నివాస్, పెండెందొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరి, బండారు సత్యానందరావు, అల్లూరు కృష్ణం రాజు, జీఎస్ రావు, వంగా గీత, వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, సినీనటులు సుమన్, ఆలీ, దర్శకుడు వి.వి.వినాయక్, జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వంకా రవీంద్రనాథ్, నియోజకవ ర్గ కన్వీనర్లు ఆకుల వీర్రాజు, వల్లూరి పట్టాభిరామారావుచౌదరి, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, తోట సుబ్బారావునాయుడు, రాజమండ్రి నగరపాలక మండలి ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిళారె డ్డి,  పార్టీ రాష్ట్రకార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, నక్కా రాజబాబు, భూపతిరాజు సుదర్శనబాబు, వట్టికూటి రాజశేఖర్, దూలం వెంకన్నబాబు, రాయపురెడ్డి చిన్న, మింది నాగేంద్ర,  వివిధ విభాగాల చైర్మన్లు అనంత ఉదయభాస్కర్(బాబు), పెట్టాశ్రీనివాస్, మండపాక అప్పన్నదొర, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర సేవాదళ్ ప్రధానకార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతమ్, సీజీసీ మాజీ సభ్యులు గంపల వెంకటరమణ, పార్టీ నాయకులు సాకా ప్రసన్నకుమార్, పి.కె.రావు, విప్పర్తి వేణుగోపాలరా వు, పెనుమత్స చిట్టిరాజు, అడపా హరి, రావి పాటి రామచంద్రరావు, శెట్టిబత్తుల రాజ బా బు, ఆదిరెడ్డి వాసు, తాడి విజయభాస్కరరెడ్డి, సత్యనారాయణచౌదరి, వాసిరెడ్డి జమీల్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, రాజ మండ్రి మేయర్ పంతం రజనీ శేషసాయి, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, డీసీఎంఎస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు శిరంగు కు క్కుటేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పంతం నానాజీ, అమలాపురం మాజీ చైర్మన్ నల్లా విష్ణు, చాంబర్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, పలువురు అధికారులు, ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు.
 
 

మరిన్ని వార్తలు