మంత్రి కార్యాలయం ముట్టడి

20 Feb, 2014 02:07 IST|Sakshi

 రాజాం రూరల్, న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు  మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు.


 రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలు బుధవారం ఉదయం రాజాంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో సమావేశమయ్యారు. అనంతరం సీఐటీయూ  డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు ఆధ్వర్యంలో అంగన్వాడీలంతా ర్యాలీగా వెళ్లి  పాలకొండ రోడ్డులోని మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అప్పటికే సీఐ అంబేద్కర్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. కార్యాల యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. మహిళా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఆ సంఘ అధ్యక్షురాలు పి.ఉమ సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికుల ఉపచారాలతో ఆమె ఉపశమనం పొందారు. దీంతో మంత్రి, పోలీసులకు వ్యతిరేకంగా ఆం దోళనకారులు నినాదాలు చేశారు.
 
  స్థానిక నాయకుల మాటలు నమ్మి కోండ్రుకు ఓట్లు వేసి తప్పు చేశామని, సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో తరి మికొడతామని హెచ్చరించారు. పోలీసు ల తీరును నిరసిస్తూ  రాజాం-పాలకొం డ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ దేవానంద్‌శాంతో సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులను వారించారు. ట్రాఫిక్ స్తంభించిపోవడం తో శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ స్టీవెన్‌సన్ హామీ మేరకు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వరలక్ష్మి, పుణ్యవతి, మంగమాంబ, ఉమాకుమారి, వేణుకుమారి పాల్గొన్నారు.
 
 
 

>
మరిన్ని వార్తలు