మైనర్‌ బాలిక కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం

22 Jul, 2020 17:35 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: సీతానగరం ఘటన బాధితుడిని మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాదితుడిని బుధవారం రోజున పరామర్శించిన మంత్రి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ దళిత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఘటనకు సంబంధించిన బాధ్యులైన వారందరిపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. (శిరోముండనం కేసులో ఎస్‌ఐ అరెస్టు)

లైంగికదాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను కూడా మంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి, ప్రభుత్వం తరపున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. (బాలికపై సామూహిక అత్యాచారం)

(పీఎస్‌లో యువకుడికి శిరోముండనం)

మరిన్ని వార్తలు