తొమ్మిది పథకాలతో రాజన్న స్వర్ణయుగం

13 Jul, 2017 21:28 IST|Sakshi
తొమ్మిది పథకాలతో రాజన్న స్వర్ణయుగం

– పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌
– రాజకీయాలకు అతీతంగా పథకాల పంపిణీ
– పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం
– వైఎస్సార్‌సీపీ ప్లీనరీతో అధికార పార్టీలో గుబులు


బంగారుపాళెం: పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు నవరత్నాల్లాంటి పథకాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగనన్న వస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మళ్ళీ రాజన్న పాలనను తీసుకువచ్చేందుకు ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాలు ప్రజలతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపిందన్నారు. 2019లో పార్టీ అధికారం రాగానే ప్రజలు రాజన్న పాలనను చూడబోతున్నారని చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసాతో రైతులకు, వైఎస్సార్‌ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తుందన్నారు.

వృద్ధులు, వికలాంగులకు వెయ్యి నుండి 2 వేల రూపాయల ఫించన్ పెంపు, అమ్మఒడి ద్వారా విద్యార్థులకు నగదు ప్రొత్సాహాలను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ నిధులు, నిరుపేదలకు 25 లక్షల ఇండ్ల నిర్మాణాలు, జలయజ్ఞంతో రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తి, మద్యపాన నిషేదం పథకాలతో నవ్యాంద్రను అభివృద్ధి బాట వైపుకు తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటించిన ప్రతి పథకాన్ని గ్రామాలకు  వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామన్నారు. పాదయాత్ర ద్వారా జగనన్న ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోనున్నారని చెప్పారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు.

ప్లీనరీకి వచ్చిన ప్రజానికాన్ని చూసి అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు పుట్టిందన్నారు. కనీస అవగాహనలేని లోకేష్‌ ను మంత్రిని చేశారని, ఆయన ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. ప్రజలు టీడీపీకి చరమగీతం పాడనున్నట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి పార్టీ ప్లీనరికి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు