గవర్నర్‌ ప్రసంగంపై ఎమ్మెల్యేల ప్రశంసలు

14 Jun, 2019 10:41 IST|Sakshi
ఎమ్మెల్యే వరప్రసాద్‌

సాక్షి, అమరావతి : ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ శుక్రవారం ప్రసంగించారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. ఇక గవర్నర్‌ ప్రసంగంపై పలువురు ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు.
(చదవండి : ఇంటింటికి నవరత్నాలు: గవర్నర్‌ నరసింహన్‌)

గవర్నర్‌ ప్రసంగంపై ఎమ్మెల్యేల మాట..
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ విధానాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టింది. ఆయన ప్రసంగంలో ప్రభుత్వ ఉద్దేశాలు ప్రస్ఫుటమయ్యాయి. అణగారిన వర్గాలను చదువుతో అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు చర్యలు చేపట్టనున్నారు. పోలవరంను కేంద్రం చేపట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం తామే చేపడతానని తప్పుడు నిర్ణయాలు చేసింది. దేశంలో సామాజిక న్యాయం చేయడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. మద్యపానంపై మా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోంది.- ఎమ్మెల్యే వరప్రసాద్‌

గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు కనువిప్పు కలిగించేలా ప్రసంగం కొనసాగింది. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం ఉంది.-ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

రాష్ట్రంలో వైఎస్ జగన్ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత పాలకుల అవినీతిపై ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. అవినీతి లేని పాలనను అందించాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అమ్మఒడి వంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారు. నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం. అవినీతి నిర్మూలనతో పాటు ప్రజాధనం దుబారా కాకుండా అరికట్టేందుకు చర్యలు చేపడతాం- ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు

మరిన్ని వార్తలు