జల విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం పర్యవేక్షణ

7 Dec, 2014 01:53 IST|Sakshi
జల విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం పర్యవేక్షణ
  • కృష్ణా, గోదావరి నదీ బోర్డుల్లో విద్యుత్ ఇంజనీర్లను సభ్యులుగా నియమించాలని కేంద్రం నిర్ణయం
  •  రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు
  • గోదావరి బోర్డులో సభ్యునిగా పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు
  • త్వరలో కృష్ణాబోర్డులోనూ సభ్యుడి నియామకం
  • సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆధారపడిన విద్యుత్ ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగిం చింది. జల విద్యుత్ వాటాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిత్యకృత్యం గా మారిన వివాదాలకు పరిష్కారం చూపే దిశ గా తొలి అడుగు వేసింది. ప్రాజెక్టుల నీటి విని యోగంతో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి, విని యోగం, వాటాల సక్రమ పంపిణీ బాధ్యతలను చూసేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ప్రత్యేకంగా విద్యుత్ ఇంజ నీర్లను సభ్యులుగా నియమించాలని కేంద్రం నిర్ణయించింది.

    ఇందులో భాగంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సీనియర్ అధికారి బి.పట్నాయక్‌ను నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా బోర్డులో సైతం త్వరలోనే సభ్యుడిని నియమిస్తామని మౌఖికం గా తెలియజేసింది. ఇప్పటికే బోర్డుల పరిధిలో ఉన్న చైర్మన్, సభ్య కార్యదర్శులతో పాటు విద్యుత్‌రంగ సభ్యుడు సైతం బోర్డు సమావేశాల్లో తీసుకునే కీలక నిర్ణయాల్లో భాగంకానున్నారు.
     
    నిత్యం కీచులాటలే..: గోదావరి బేసిన్‌లో ఉన్న ఎగువ, దిగువ సీలేరు, కృష్ణా జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో జల విద్యుదుత్పత్తి విషయమై రెండు రాష్ట్రాలు నిత్యం కీచులాడుతూనే ఉన్నాయి. సీలేరులో 700 మెగావాట్లు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కోసం నీటి వాడకం వివాదాలపై బోర్డు స్వయం గా కలగజేసుకున్నా ఇంతవరకు ఎలాంటి ఫలి తం రాలేదు. దీంతో రెండు రాష్ట్రాలు కేంద్రమే ప రిష్కరించాలని కోరాయి. సీలేరులో ఏపీ విద్యుదుత్పత్తి చేస్తున్నా వాటి వివరాలేవీ బయటకు వెల్లడించడం లేదు. దీనిపై బోర్డు కలుగజేసుకొని స్వయంగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ను సంప్రదించినా వివాదానికి తెరపడలేదు.
     
    శ్రీశైలంపై వాదోపవాదాలు..: ఇక శ్రీశైలం లో నీటి వాడకంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 554 అడుగులేనని, అంతకు మంచి విద్యుత్ అవసరాలకు వాడుకోవడానికి వీలులేదని ఏపీ అభ్యంతరం తెలుపుతుండగా, గతంలోని జీవోల ఆధారంగా తమకు 534 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని తెలంగాణ గట్టిగా చెబుతోంది.

    సాగర్‌పైనా ఇరు రాష్ట్రాల మధ్య వివాదమే సాగుతోంది. వరుస వివాదాలు, ఫిర్యాదులపై బోర్డు తీసుకున్న చొరవ ఏమాత్రం ఫలించలేదు. సీలేరు వివాదంలో స్వయంగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ చైర్మన్ నీరజా మాథూర్ కల్పిం చుకొని నివేదిక కోరినా ఏపీనుంచి స్పందన లేని కారణంగా అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో జల విద్యుదుత్పత్తిపై నిరంతర పర్యవేక్షణ, ని యంత్రణ ఉండేలా చూసేందుకు కొత్తగా విద్యు త్‌రంగ సీనియర్ ఇంజనీర్‌ని నియమించాలని కేంద్ర ప్రాధికార సంస్థ కేంద్ర విద్యుత్ శాఖను కోరింది.

    దీనికి కేంద్ర జల సంఘం అంగీకారం తెలుపడంతో కేంద్ర విద్యుత్ శాఖ, నదీ యాజ మాన్య బోర్డుల్లో విద్యుత్ అనుబంధ సభ్యుల నియామకాలకు ఒకే చెప్పింది. దీనిలో భాగంగా గోదావరి బోర్డులో పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా, త్వరలోనే కృష్ణా బోర్డులో సైతం సభ్యుడి నియామకం ఉంటుందని నీటి పారుదల అధికారులకు సమాచారం పంపింది.

>
మరిన్ని వార్తలు