ఫెర్రీలో రాక్షసి జాతి చేపలు

26 Jun, 2018 12:40 IST|Sakshi

ఇబ్రహీంపట్నం(మైలవరం): కృష్ణానది ఫెర్రీ ప్రాంతంలో పిరాణా తరహా చేపల సంచారంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. చేపలు రాక్షసిలా ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించే చేపకు శరీరమంతా ముళ్లు ఉంటాయి. తినేందుకు పనికిరాని ఈచేపల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. పెద్దనోరు కలిగి చిన్నచేపలను మింగేయటంతో పాటు నదిలో చేపల వేటకు వేసిన వలలను కొరికి జాలర్లకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి ఏడాది పట్టిసీమ కాలువ నుంచి కృష్ణానదికి గోదావరి జలాలు వదిలిన సమయంలోనే ఈ చేపలు కనిపిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు