ఎన్నాళ్లిలా?

20 Dec, 2014 02:42 IST|Sakshi
ఎన్నాళ్లిలా?

అనంతపురం కార్పొరేషన్ : సుదీర్ఘ కాలం అధికారుల పాలన తర్వాత నగర పాలక సంస్థకు కొత్త పాలక వర్గం ఏర్పడటంతో ఇక మంచి రోజులొచ్చాయని సంబరపడిన ప్రజలకు నిరాశే ఎదురరుు్యంది. పాలకవర్గం ఏర్పడి ఐదు నెలలు దాటినా పాలనపై మేయర్ మదమంచి స్వరూప పట్టు సాధించలేక సతమతమవుతున్నారు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
 
 నగరంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటి కూడా జరగడం లేదు. అత్యంత కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురువుతున్నారు. పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. సమస్యలతో ప్రజలు సతమవుతున్నారు. ఐదునెలలుగా మేయర్ నగరంలో పర్యటిస్తున్నా పారిశుద్ధ్యం కనీస స్థాయిలో కూడా మెరుగు పడలేదు. మేయర్‌గా స్వరూప బాధ్యతలు చేపట్టిన ఐదు నెలలు గడిచింది. పాలనా వ్యవహారాలపై అవగాహన వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. వేరొకరు వెనకుండి నడిపించినట్లుగా పాలన సాగిస్తున్నారు. ఆమె ఆదేశాలు ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదంటే పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోంది.
 
 వర్గ పోరు షురూ
 పాలకవర్గంలో వర్గ రాజకీయం ఆది నుంచి కొనసాగుతోంది. మేయర్‌ది ఒక వర్గం, డిప్యూటీ మేయర్‌ది మరో వర్గం. ఇరు వర్గాల మధ్య విభేదాలు ఏ స్థారుులో ఉన్నాయో ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశం అద్దం పట్టింది. అధికార పార్టీ సభ్యుల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. ఒక వర్గం సభ్యుడు చేసిన ప్రతిపాదనను మరోవర్గం సభ్యులు విబేధించడం కనిపించింది. ఇలాంటి పరిస్థితి నిత్యం కార్యాలయంలో ప్రతి విషయంలోనూ కనిపిస్తోంది. నగర పాలనలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జోక్యాన్ని అడ్డుకోవడానికే మేయర్ వర్గానికి సమయం సరిపోనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చే దిశగా అన్నట్లు.. డివిజన్‌కు రూ.5 లక్షలతో అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు మరో రూ.10 లక్షలు కేటారుుంచేందుకు సిద్ధమవుతున్నారు తప్పించి ప్రణాళికా బద్ధంగా వెళుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నగరంలో ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తాయి. వాటిలో పందులు చేరి మరింత అధ్వానంగా మారుస్తుంటాయి. వంకలు, కాలువల్లో మురుగు పేరుకుపోయింది. కాలనీల్లో కాలువ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంటుంది. నగర ప్రజలను కుక్కలు, కొతులు, పందుల బెడద వేధిస్తోంది. ఈ సమస్యలు పరిష్కరించే విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదనే అపవాదును సైతం మూటగట్టుకున్నారు. సంస్థలో అత్యంత కీలకమైన విభాగాల్లో టౌన్ ప్లానింగ్ ఒకటి. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. టీపీఓ, రెండు టీపీఎస్‌లు పోస్టులు, రెండు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
  సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్యకలాపాలు సక్రమంగా జరగాలంటే పూర్తి స్థాయిలో సిబ్బంది అవసరమని తెలిసినా ఈ అంశంపై మేయర్ ఇప్పటి వరకు దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. మేయర్ పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వెనుక షాడో మేయర్లుగా ఇద్దరు పాలన సాగిస్తునట్లు విమర్శలు బహిరంగంగా వినవస్తున్నాయి. ఏ పనైనా వారిని కలిస్తే అయిపోతుందనే ప్రచారం జోరందుకుంది.

మరిన్ని వార్తలు