‘మై ఓట్‌ నాట్‌ ఫర్‌ సేల్‌’

9 Apr, 2019 11:42 IST|Sakshi

సాక్షి, మంగళగిరి : ప్రస్తుత స్వారత్రిక ఎన్నికల సందర్భంగా వాట్సప్‌లో మై ఓట్‌ నాట్‌ ఫర్‌ సేల్‌ చిత్రం హల్‌చల్‌ చేస్తుంది. ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేలా ఉండటంతో ఈ చిత్రాన్ని షేర్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ఓటుకు నోటిచ్చినా... తీసుకున్నా... నేరమే అని ది రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పబ్లిక్‌ యాక్డ్‌ 1951లో సెక్షన్‌  123(1) చెబుతుంది. ఈ చట్టంలోని 171(బీ) ప్రకారం ఏ వ్యక్తి అయినా ఓటర్‌ను ప్రలోభపరిచినా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగదు, ఇతరత్రా కానుకలు తీసుకున్నా, ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. సెక్షన్‌ 171(సీ) ప్రకారం ఓటర్లను ప్రలోభపరిచినా, బెదిరించినా, అనుకూలంగా ఓటు వేయాలని దాడి చేసినా ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి రెండూ విధించవచ్చు.  

మరిన్ని వార్తలు