మిస్టరీగా ఆర్మీ జవాను మృతి

4 Nov, 2014 09:27 IST|Sakshi

గోపాలపట్నం: ఆర్మీ జవాను బల్ల అప్పలరాజు(38) ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆయన మరణంతో వేపగుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ మెహదీపట్నం ఆర్మీ ఏరియాలో ఈనెల 8న ముస్తఫా అనే బాలుడు మృతి చెందాడు. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న ఆర్మీ ఉద్యోగి బల్ల అప్పలరాజు ఆర్మీ క్యాంపస్‌లో సోమవారం తెల్లవారుజామున పిస్తోలుతో కాల్చుకుని మరణించడం మిస్టరీగా మారింది.
 
 ఏడాదిలో సర్వీసు ముగుస్తుందనగా...
 అప్పలరాజు స్వస్థలం వేపగుంట. ము త్యాలమ్మ, నరసమ్మ దంపతుల మూడో కుమారుడు. ముందు నుంచి చురుగ్గా ఉండే ఆయన చిన్న వయసులోనే ఆర్మీ లో చేరారు. తొమ్మిదేళ్ల క్రితమే అనసూయతో వివాహం జరిగింది. వీరికి కొడు కు నిషాంత్(7), కుమార్తె ప్రణతి (15 నెలలు) ఉన్నారు. అప్పలరాజు గతంలో జమ్ము, సిక్కిం, పంజాబ్, అండమాన్ లో సైనికునిగా పనిచేసి ఉన్నతాధికారులతో పతకాలు కూడా అందుకున్నాడు.
 
 తాజాగా హైదరాబాదు మెహదీపట్నం ఆర్మీ ఏరియాలో భార్యా పిల్లలతో ఉం టున్నాడు. మరో ఏడాదిలో సర్వీసు ము గియనుంది. దసరాకి భార్యాపిల్లలతో వేపగుంట వచ్చిన అప్పలరాజు పది రోజులు గడిపి వెళ్లారు. పేదరికంలో ఉన్న అన్నయ్య, అమ్మకీ అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇంతలో అప్పలరాజు మరణంచినట్లు టీవీల ద్వా రా తెలుసుకున్న ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు షాకయ్యారు.
 
 నా కుమారుడు దేశభక్తుడు
 తన కుమారుడు హత్యలు చేసే వ్యక్తి కాడని, దేశభక్తుడని తల్లి ముత్యాలమ్మ తెలిపిం ది. చనిపోయేటంత పిరికివాడు కాదని, అతడి మరణంపై తమకు అనుమానాలున్నాయని సోదరుడు ముత్యాలు అన్నారు. అప్పలరాజు స్వతహాగా వివాదరహితుడని, ఎవరో హతమార్చి పిస్తోలుతో కాల్చుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు