సిక్కిం వరదల్లో నిజామాబాద్‌ ఆర్మీ జవాన్‌ మృతి

6 Oct, 2023 09:13 IST|Sakshi

సాక్షి, నిజాబాద్‌: సిక్కింలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన వరదల్లో చిక్కుకొని చనిపోయిన ఆర్మీ జవాన్లలో నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లికి చెందిన నీరడి గంగాప్రసాద్‌ ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. గురువారం మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం కోసం పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గిరి జిల్లా ఆస్పత్రికి ఆర్మీ అధికారులు తరలించారు. శుక్రవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకునే అవకాశాలున్నా యి.

ఎమ్మెల్యే షకీల్‌ సమకూర్చిన విమానంలో మృతుడి తమ్ముడు సుధాకర్, మరో బంధువు దిలీప్‌ బయలుదేరి వెళ్లి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పశ్చి మబెంగాల్‌లోని బినాగుడి ఆర్మీ హెడ్‌ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్న గంగాప్రసాద్‌ శిక్షణలో భాగంగా 20 రోజుల క్రితం సిక్కింలోని జులుక్‌ ప్రాంతానికి వెళ్లి తీస్తా నది వరదల్లో గల్లంతయ్యారు. గంగాప్రసాద్‌ది నిరు పేద దళిత కుటుంబం. గంగాప్రసాద్‌కు భార్య శిరీష, ఇద్దరు కుమారులు హర్ష(6), ఆదిత్య(3) ఉన్నారు. 

మరిన్ని వార్తలు