పోలీసుల అదపులో మైత్రిఫైనాన్స్ యజమానులు

30 Sep, 2013 14:57 IST|Sakshi

ఎమ్మిగనూరు: మైత్రి ఫైనాన్స్ చైర్మన్ మాధవరెడ్డి, డైరెక్టర్లు కొండారెడ్డి, మాల్యాద్రిలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ కంపెనీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలను వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న బాధితులు ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయవద్దని బాధితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.  పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులకు, బాధితులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. వారిని అరెస్ట్ చేస్తే జైలుకు వెళతారు తప్ప తమకు న్యాయం జరగదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

వారం రోజుల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన ఖాసిం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కంపెనీ అధిపతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు ఎంతమేర ప్రజాధనం కొల్లగొట్టారో విచారించవలసి ఉందని వారు చెప్పారు.

 

మరిన్ని వార్తలు