స్వాగతం అదిరిపోవాలి

8 Sep, 2018 07:59 IST|Sakshi
స్వాగత ఏర్పాట్లపై చర్చిస్తున్న విజయసాయిరెడ్డి, మళ్ల విజయప్రసాద్, ఎంవీవీ సత్యనారాయణ, తైనాల విజయప్రసాద్, తలశిల రఘురాం తదితరులు

కొత్తపాలెం నుంచి సిటీలో పాదయాత్ర ప్రారంభం

వైఎస్సార్‌ సీపీ లో చేరనున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడి

విశాఖపట్నం, గోపాలపట్నం: నగరంలో శనివారం మొదలుకానున్న వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర అపూర్వఘట్టంగా మిగిలిపోతుందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. అందుకు తగ్గట్టుగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గోపాలపట్నం కొత్తపాలెం నుంచి శనివారం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో ఆయన పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయప్రసాద్, పార్లమెంట్‌ సమన్వయకర్త ఎంవీవీ సత్యన్నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురామ్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్ర వివరాలను వెల్లడించారు.

పెందుర్తి నియోజకవర్గంలో జెర్రిపోతులపాలెం నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ప్రజాసంకల్పయాత్ర ఉదయం 11కి కోటనరవ హనుమాన్‌ ఆలయం వద్దకు చేరుతుందని, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ను  వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కండువా వేస్తారని తెలిపారు. మధ్యాహ్నం మూడుగంటలకు పశ్చిమ నియోజకవర్గం కొత్తపాలెంలోకి జగన్‌మోహన్‌రెడ్డి చేరుకుంటారని చెప్పారు. వినూత్నంగా,  అపూర్వ ఘట్టంగా మిగిలేలా స్వాగత ఏర్పాట్లు జరుపుతున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రజాసంకల్పయాత్ర  గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్‌కు చేరుతుందని చెప్పారు. హైస్కూల్‌ క్రీడామైదానంలోనే జగన్‌మోహన్‌రెడ్డి బస చేస్తారని తెలి పారు.

ఈనెల 9న ఉదయం గోపాలపట్నం నుంచి ప్రజాసంకల్పయాత్ర ఆరంభమై కంచరపాలెం చేరుకుంటుందని, అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి  ప్రసంగిస్తారని చెప్పారు. ఈనెల 10న మధ్యాహ్నం సిరిపురం విజ్ఞాన్‌ గ్రౌండ్స్‌లో బ్రాహ్మణ ఆత్మీయ సభలో ప్రసంగించి, మర్నాడు 11న ఉదయం11 గంటలకు  బీచ్‌లో విశాఖ ఫంక్షన్‌ హాల్లో 13 జిల్లాల అసెంబ్లీ, పార్లమెంట్‌ సమన్వయకర్తలు, రీజినల్‌ అధికార ప్రతినిధులతో జగన్‌మోహన్‌రెడ్డి  భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారన్నారు. ఈనెల 12న మధ్యాహ్నం మూడుగంటలకు ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముస్లిం సోదరుల ఆత్మీయ సభలో  ప్రసంగిస్తారని తెలిపారు. ఈనెల 15న భీమిలిలో ప్రవేశించాక ఆరిలోవలో న్యాయవాదులు, ప్రొఫెసర్లు సంఘీభావం చెబుతారని చెప్పారు. ఇలా  విజయనగరం మీదుగా ప్రజాసంకల్ప యాత్ర సాగించి నవంబరు నెలాఖరులోగా ముగిస్తారని వివరించారు.

మరిన్ని వార్తలు