కొత్త కలెక్టర్‌ నివాస్‌

23 Feb, 2019 08:59 IST|Sakshi
కలెక్టర్‌ నివాస్‌

ప్రస్తుత కలెక్టర్‌  రామారావుకు విజయవాడ బదిలీ

ఈ నెల 9నే జిల్లాకువచ్చిన రామారావు అంతలోనే బదిలీ  

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కలెక్టర్‌ మళ్లీ మారారు.ఈ నెల9నే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ ఎం.రామారావు రెండు వారాలు కూడా గడవక ముందే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడమున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న జె.నివా స్‌ను నియమించారు. రామారావును విజయవాడకు బదిలీ చేశారు. ఈ మేరకు  శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం 409 జీఓను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. నివాస్‌ డైరెక్ట్‌ ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన ఉద్యోగి.

ఆయన గతంలో జేసీగాను, ఇతర హోదాల్లో పనిచేశారు. అయి తే రామారావు బదిలీ జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. ఎన్నికల సమయంలో ఇప్పటికప్పుడు ఇద్దరి కలెక్టర్లను మార్చడం రాష్ట్ర ప్రభుత్వం అస్థిరత్వానికి నిదర్శనమనే వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. అయితే రామారావు చు రుగ్గా లేరని, ఎన్నికల సమయంలో ఆయన తర్వాత కేడర్‌లో ఉన్న ఉద్యోగులు రామారా వును డామినేట్‌ చేస్తారని, అందుకే ఆయనను బదిలీ చేశారనే ప్రచారమూ ఉంది. ఇటీవల జి ల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు కూ డా బదిలీపై ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా