అంతర్జాతీయ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ

5 Sep, 2019 15:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు ‘న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు’ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌‌ జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ తాడేపల్లి నివాసంలో ఈ ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి 6వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70 శాతాన్ని బ్యాంకు మంజూరు చేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటు చేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈబ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25వేల కోట్లు మంజూరు చేసింది. (చదవండి: ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్‌తో రోజా భేటీ

తుంగభద్రకు వరద; హెచ్చరించిన కమీషనర్‌

'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'

‘అయ్యన్న పాత్రుడితో అలా మాట్లాడించింది బాబే’

డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు

ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తాం

‘సీఎం జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారు’

‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’

ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్‌

ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన చింతమనేని బాధితులు

ఏపీ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..

గురువులకే గురువు ఆయన!

‘అయ్యన్న దోపిడీ ప్రజలు మర్చిపోలేదు’

కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌

‘పవన్‌ అందుకే వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు’

నూతన ఇసుక రీచ్‌ను ప్రారంభించిన మంత్రి

‘దేశ రక్షణ రంగంలో నేవీ కీలక పాత్ర’

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌కు కృతజ్ఞతలు

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

గురువులకు నా పాదాభివందనాలు: సీఎం జగన్‌

యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!

కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

పోలీసులకు సవాల్‌ విసిరిన పేకాట రాయుళ్లు..

గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

టీటీడీ సభ్యుడి రేసులో నేను లేను

చింతమనేని అనుచరుల బెదిరింపులు

సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ భేటీ

‘భారత క్రికెట్‌ జట్టు అత్యుత్తమమైనది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆ అవసరం అనుష్కకి లేదు’

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’