అక్షరాలా రూ.10 కోట్లు

2 Jan, 2015 05:06 IST|Sakshi
అక్షరాలా రూ.10 కోట్లు

- కేకులు, పూలకు రూ. 2 కోట్లు
- విందుకు రూ. 2 కోట్లకుపైనే
- మద్యానికి రూ. 5 కోట్లు.... ఇతరాలకు రూ. కోటి
- నూతన సంవత్సర వేడుకలకు జిల్లా వాసులు  చేసిన ఖర్చు

కడప కల్చరల్ : నూతన సంవత్సరం  సందర్భంగా సంతోషంగా గడిపేందుకు జిల్లా వాసులు 24 గంటల్లో చేసిన ఖర్చు రూ. 10 కోట్లు.  నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ  ఆ రోజును జీవితంలో మరుపురాని విధంగా మలుచుకోవాలని 2014 డిసెంబరు 31 వతేదీ  మధ్యాహ్నంనుంచి 2015 జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని బంధుమిత్రులతో విందులు, వినోదాలతో సంతోషంగా గడిపారు.

ఇందులో ముఖ్యంగా యువతదే ప్రథమస్థానం. డిసెంబరు 31వ తేదీ రాత్రి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వినోద, సాంసృ్కతిక కార్యక్రమాల కోసమే ప్రజలు దాదాపు రూ. కోటి ఖర్చు చేశారు. నూతన సంవత్సరం ప్రారంభ దినాన సంతోషంగా గడిపితే ఈ సంవత్సరమంతా అదే  ఆనందం  కొనసాగుతుందన్న  నమ్మకంతో ఖర్చు గురించి ఆలోచించలేదు. డిసెంబరు 31వ తేదీ  రాత్రి 10 గంటల నుంచి మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు సందడిగా మారాయి.

మద్యం షాపుల్లో  రాత్రి 12.30 గంటల వరకు గ్లాసుల గలగల వినిపించింది. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత రోడ్లపై ఎలాంటి కార్యక్రమాలను అనుమతించబోమని, వేడుకలన్నీ ఈలోపుగానే నిర్వహించుకోవాలని పోలీసులు ప్రత్యేకంగా హెచ్చరించడంతో గడువులోపే సంబరాలు ముగించుకున్నారు. పోలీసుల హెచ్చరికల ప్రభావంతో తెల్లవార్లు జరగాల్సిన ప్రత్యేక సంబరాలకు అడ్డుకట్ట పడినట్లయింది. ఫలితంగా నూతన సంవత్సర వేడుకల ఖర్చుకూడా  ఒకింత తగ్గింది.

మరిన్ని వార్తలు