పుష్పగుచ్చం ఇచ్చారు.. పూలు మరిచారు!

7 Nov, 2023 07:23 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల జోష్‌ తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ 17న ఇక్కడ ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ- కాంగ్రెస్ మధ్యేనే నెలకొంది. 

రాష్ట్రంలో మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రెండు పార్టీలు చెబుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ  ఇండోర్‌లో  ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఆమె వేదికపైకి రాగానే స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అయితే ఒక నేత ఆమెకు ఇ‍చ్చిన పూలగుత్తిలో పూలు మాయమయ్యాయి. దీనిని గమనించిన ప్రియాంక గాంధీ ఆ పుష్పగుచ్చంలో పూలు లేవని అక్కడున్న నేతలకు చెప్పారు. దీంతో వారంతా నవ్వుకున్నారు.

ఈ ఉదంతానికి  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ పాఠక్ స్పందించారు. అతను తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాశారు. ‘ఇదొక గుత్తి స్కామ్, పుష్పగుచ్ఛం నుండి పూలు మాయమయ్యాయి. స్క్వాడ్ పట్టేసుకుంది’ అని రాశారు.

ఇండోర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 250 కుంభకోణాలు చేసి, ప్రజా ధనాన్ని దోచుకుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది?
 

మరిన్ని వార్తలు