బండి నంబర్ మారదండి

4 Jun, 2014 00:41 IST|Sakshi
బండి నంబర్ మారదండి

 తణుకు అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త వాహనాలకు కొత్త నంబర్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ ఉంటుందనే ఊహాగానాలకు తెరపడింది. సీమాంధ్ర జిల్లాల్లోని వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధానాన్నే అనుసరించాలంటూ రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. మన జిల్లాకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన విధంగా ‘ఏపీ 37’ సిరీస్‌తోనే కొత్త  వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతుందని రవాణా శాఖ అధికారులతోపాటు సాధారణ ప్రజలూ భావించారు. ఈ కారణంగా సుమారు 10 రోజుల నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయూయి.
 
 కొత్త సిరీస్ వచ్చిన అనంతరం ఆ నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో వాహనాలు కొన్నవారు ఇప్పటివరకూ వేచిచూశారు. అయితే, తెలంగాణ జిల్లాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతుందని, సీమాంధ్ర జిల్లాల్లో పాత సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్లు చేయూలని ఆదేశాలు వెలువడటంతో కొత్త వాహనాలు కొన్నవారి ఆశలు నీరుగారాయి. తాజా ఆదేశాల నేపథ్యంలో కొన్ని రోజులుగా ఖాళీగా దర్శనమిచ్చిన రవాణా శాఖ కార్యాలయూల్లో  రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు తిరిగి మొదలయ్యూయి. తణుకు రవాణా శాఖ కార్యాలయంలో మార్చిలో మొదలైన ‘ఏపీ 37 సీసీ’ సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. మంగళవారం నాటికి ఆ సిరీస్‌లో 1899 నంబర్ వరకు వచ్చింది. ఏపీ 37 సీసీ 1899 నంబర్ కోసం ఓ యువకుడు రూ.10 వేలు చెల్లించి వేలంలో ఆ నంబర్ దక్కించుకునేందుకు సిద్ధమయ్యూడు.
 

మరిన్ని వార్తలు