కిరణ్‌పై క్రమశిక్షణ చర్యలుండవు: ఏఐసీసీ

28 Jan, 2014 02:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 ప్రస్తుతం శాసనసభలో ఉందని, దీనిపై విప్ ఏదీ జారీచేయలేదని, కాబట్టి సభ్యు లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడైన ఆయన సోమవారం తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. బిల్లు రాజ్యాంగబద్ధంగా లేదని, దానిని తిరస్కరిస్తూ తీర్మానం చేయాలంటూ సీఎం కిరణ్ స్పీకర్‌కు నోటీసు ఇచ్చినందున ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా, అలాంటిదేం లేదన్నారు. సీడబ్ల్యూసీ, కేంద్రకేబినెట్ ఆమోదించి రాష్ట్రపతి ద్వారా పంపిన తెలంగాణ బిల్లును తిరస్కరించాలని కోరడం క్రమశిక్షణారాహిత్యం కిందకు రాదా అని ప్రశ్నించగా, ఆ బిల్లుపై విప్ జారీ చేయనందున ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించవచ్చని చెప్పారు.

>
మరిన్ని వార్తలు