Sakshi News home page

నేడు నేవీ డే

Published Sun, Dec 10 2023 6:26 AM

Vizag Navy Day Celebrations on 10 December - Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత్‌ పాకిస్తాన్‌ మధ్య జరి­గిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వ­హిస్తారు. ఈ కార్యక్రమం విశాఖలోని తూర్పు నౌకా­దళ ప్రధాన కేంద్రంలో జరుగుతుంది.  ఈ ఏడాది మిచాంగ్‌ తుపాను కారణంగా 4న∙జరగా­ల్సిన వేడు­కల­ ను 10కి వాయిదా వేశారు.

తూర్పు నౌకా­దళం ఆధ్వర్యంలో ఆర్‌కే బీచ్‌ వద్ద  ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ ప్రద­ర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధ నౌక­లు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికా­ప్టర్లతో సి­బ్బం­ది విన్యాసాలను ప్రదర్శిస్తారు. సుమారు 2 వేల­మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాలు­పంచుకుంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 

ముఖ్య అతిథిగా గవర్నర్‌ నజీర్‌
నౌకాదళ దినోత్సవానికి ఈ ఏడాది ముఖ్య అతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌  హాజరు­కానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యా­హ్నం 12.30 గంటలకు విశాఖ విమా­నాశ్రయం చేరుకుని 1 గంటకు పోర్టు గెస్ట్‌­హౌస్‌కు వస్తారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ విన్యాసాలకు హాజరవుతారు. సాయంత్రం 5.35 గంటల వరకు అక్కడే ఉండి, అనంతరం తూర్పు నౌకాదళ (ఈఎన్‌సీ) చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ ఆధ్వర్యంలో నేవీ హౌస్‌లో ‘ఎట్‌ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందుకు హాజరవుతారు. తిరిగి రాత్రికి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. 

Advertisement

What’s your opinion

Advertisement