కారు బోల్తా- ఒకరి మృతి

18 Jan, 2016 08:29 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామ సమీపంలో సోమవారం ఉదయం కారు బోల్తాపడి ఒక వ్యక్తి మృతిచెందాడు. చిలమకూరు ఐసీఎల్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సంతోష్‌కుమార్(38) సోమవారం ఉదయం కడప నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడడంతో సంతోష్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఎర్రగుంట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు