రూ.25 కోట్లతో పంచాయతీరాజ్ పనులు

23 May, 2015 00:30 IST|Sakshi

బొబ్బిలి రూరల్ : తమ డివిజన్ పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.25కోట్ల వ్యయంతో 780 పనులు జరుగుతున్నాయని ఆ శాఖ పార్వతీపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.గజేంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారి పనులు అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. సాంకేతిక సమస్య లేదని తెలిపారు. అన్ని పనులూ ప్రారంభించామని, 2016 మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. తమ పరిధిలో 202 పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని, ఒక్కో పంచాయతీ భవనానికీ రూ.13 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నామన్నారు.
 
 వీటిలో 193 నిర్మాణదశలో ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ భవనాలు 46మంజూరయ్యాయని, ఒక్కో భవనానికి 6.5లక్షల రూపాయలు నిధులు అందిస్తున్నామన్నారు. వీటిలో 40 వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఉపాధిహామీ పథకంలో ఫేజ్-2, ఫేజ్-3 పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. సిబ్బంది కొరత వేధిస్తోందని, దీనికోసం టీఏలను నియమించాలని ప్రతిపాదనలు పంపామని, జిల్లా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు.  సాంకేతిక సమస్య తలెత్తితే 24గంటలలో పరిష్కరిస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు