Dec 3rd: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

3 Dec, 2023 07:19 IST|Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

07:14 AM, Dec 3, 2023
ఓట్లతో తెలుగుదేశం రాజకీయాలు
తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్‌ మొదలుపెట్టిన తెలుగుదేశం
ఇప్పటివరకు ఏపీలో నకిలీ ఓటర్లంటూ ప్రచారం
ఇప్పుడు ఏకంగా తెలంగాణలో కౌంటర్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం
మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్‌ చేసుకోవాలా?
నిజాంపేట విజ్ఞాన్‌ స్కూల్‌లో ఏకంగా కౌంటర్‌ ప్రారంభించిన తెలుగుదేశం
దాంతో పాటు పలు కాలనీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్‌ కౌంటర్లు
జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలు
తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం
తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్ర
ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నం
ఎన్నికల రోజు వీరందరిని తరలించి టిడిపికి ఓటేయించే కుట్ర

07:08 AM, Dec 3, 2023
ఆ సలహా ఇచ్చింది ఎవర్రా?

  • తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్‌ అంశం
  • లోకేష్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ
  • 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి?
  • పవన్‌ కళ్యాణ్‌కు జై కొట్టమని లోకేష్‌కు సలహా ఇచ్చింది ఎవరు?
  • తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్‌కు అర్థమవుతోందా?
  • తన కెరియర్‌తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా?
  • ఇప్పుడు కాపుల కోసం పవన్‌కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం?
  • అసలు పవన్‌కళ్యాణ్‌కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్‌కు ఏం లాభం?
  • పైగా పవన్‌ను దూరం చేసే ప్లాన్‌ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు?

07:05 AM, Dec 3, 2023
నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు

మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా
►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా?
►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు?
►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది?

తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే
►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు

టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
►అమరావతిలో  భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను  చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు

ఆనాటి స్పీకర్‌ కోడెల చౌదరి
చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ...
►"ఇది విపక్షాలు చేయించిన పనే అని  సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్‌గా ఉండికూడా  చూపలేదు.
►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు?
►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా?

కాపు ఉద్యమ సమయంలో  తునిలో  రత్నాచల్‌ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టారు
►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్‌ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.?
►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్‌లు చేశారు?
►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?

చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం
►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయ‌ర్ దంప‌తుల హ‌త్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు.
►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంట‌నే విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టాడు. ఇది `బ‌లిజ‌ల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హ‌త్య చేయించారు` అని ఆరోపణలు చేశారు.
సీన్‌ క‌ట్ చేస్తే ..
►మేయ‌ర్ దంప‌తుల‌ హ‌త్య ఆస్థి త‌గాదాల కోసం జ‌రిగింద‌ని, అది చేసింది మేయ‌ర్ మేన‌ల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే..
►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే
►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం  బాబుకు వెన్నతో పెట్టిన విద్యే

ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి.
►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది
►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు
►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు
►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.!

మరిన్ని వార్తలు