‘పారా మెడికల్’ను భ్రష్టుపట్టిస్తున్న ప్రభుత్వం

30 Mar, 2016 04:04 IST|Sakshi
‘పారా మెడికల్’ను భ్రష్టుపట్టిస్తున్న ప్రభుత్వం

అనంతపురం మెడికల్ : ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కళాశాలలను ప్రభుత్వం భ్రస్టు పట్టిస్తోందని జాతీయ బహుళార్థక సంక్షేమ సంఘం చైర్మన్ డాక్టర్ కేఎస్ అబ్దుల్ రజాక్ గఫూర్ ఆరోపించారు. మంగళవారం గఫూర్ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత పారామెడికల్ విద్య అత్యంత నిరాదరణకు గురైందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో టెక్నికల్ విద్య కోర్సు చేయడానికి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారన్నారు.

అయితే అధికారుల సమన్వయ లోపంతో నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఏడాది కాలాన్ని విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం పారామెడికల్ కళాశాలలను మూసివేయించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో సంఘం సభ్యుడు దాదాపీర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు