వినతులు, విజ్ఞప్తుల మధ్య...

20 Aug, 2018 06:52 IST|Sakshi

ప్రజాసంకల్పానికి వెల్లువెత్తిన ప్రజా సమస్యలు

భరోసా కల్పించాలంటూ104,108 సిబ్బంది విజ్ఞప్తి

4వ రోజు సంకల్ప యాత్రకు జనసందోహం

సాక్షి,విశాఖపట్నం: అడుగు ముందుకు పడనీ యని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్ర జా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తుల మధ్య ఆదివారం ప్రజాసంకల్పయాత్ర సాగిం ది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర వరుసగా నాలుగో రోజుకూడా నర్సీపట్నం నియోజక వర్గంలోనే సాగింది. నర్సీ పట్నం శివారు పెదబొడ్డేపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర సుబ్బరాయుడుపాలెం, మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం, వజ్రగ డ క్రాస్, తమ్మయ్యపాలెం మీదుగా జోగినాథునిపాలెం వరకు సాగింది. జననేత ఆదివారం మధ్యాహ్నం భోజన విరామానికి ఆగకుండా ఏకబికిన తొమ్మిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గ్రామ శివారులోని కెన్విన్‌ స్కూల్‌ సమీ పంలో నాల్గోరోజు పాదయాత్ర ముగిసింది.

వెల్లువెత్తిన వినతులు
పాదయాత్రలో ఓ వైపు నలతగా ఉన్నప్పటికీ తనకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని ఏ మాత్రం నిరుత్సాహ పర్చకుండా ఓపిగ్గా వారి అర్జీలు తీసుకుంటూ ముందుకు సాగారు. 108, 104 ఉద్యోగులు కలుసుకు తమ భవిష్యత్‌ లేకుండా పోయిందని మొరపెట్టుకున్నారు. సీపీఎస్‌ విధానం వల్ల రిటైర్‌ అయిన తర్వాత వృద్ధాప్యంలో ఎలా బతకాలో తెలియడం లేదని ఉద్యోగులు వాపోయారు. ఇక పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగించారని, ఉపాధి పనులు కల్పించడం లేదని ఇలా తమ కష్టాలు.. కన్నీళ్లు చెప్పుకోగా వచ్చిన ప్రతి ఒక్కర్ని పేరుపేరునా పలుకరించి మీకు అండగా నేనున్నాంటూ భరోసానిచ్చారు. జగనన్న వస్తేనే మాకు భరోసా లభిస్తుందని పారా మెడికల్‌ సిబ్బంది, వైఎస్‌ హఠన్మరణం తర్వాత తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని 104,108 సిబ్బంది జగన్‌కు మొరపెట్టుకున్నారు. ఇక ప్రస్తుత ప్రజాకంటక పాలనలో పింఛన్లు తీసేసారని, ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వడంలేదని. అర్హత ఉన్న ట్రిపుల్‌ ఐటీలో సీట్లు ఇవ్వడం లేదని ఇలా పెద్ద సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పాదయాత్ర టూర్‌ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురామ్, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూ రావు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి ఎం.బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, సీఈసీ సభ్యులు కె. శ్రీకాంత్, అంకంరెడ్డి జమీల్, రాష్ట్ర కార్యదర్శి తాడి విజయభాస్కరరెడ్డి, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష, విశాఖ, అరుకు పార్లమెంట్‌ జిల్లాల విద్యార్థి విభాగం అధ్యక్షులు బి.కాంతారావు, టి.సురేష్‌కుమార్, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శెట్టి గంగాధరస్వామి, బి. అప్పారావు, గుంటూరు సేవాదళ్‌ అధ్యక్షుడు కొప్పా చినపరెడ్డి, గుంటూరు విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి శివనాగిరెడ్డి, చింతపల్లి, కురుపాం జడ్పసీటీసీ సభ్యులు కంకిపాటి పద్మకుమారి, పి.చంటి, హనుమాన్‌ జంక్షన్‌ నుంచి శివాజీ, నంద్యాల నుంచి శిరుప శ్రీనివాసరెడ్డి, కర్నూలు నుంచి ఎర్రబోతుల వెంకటరెడ్డి, కడప నుంచి బి.సాంబశివరెడ్డి, ప్రముఖ వైద్యులు పి.రామచంద్ర, పి.ఎస్‌.వి. రాజశేఖర్, లక్ష్మీకాంత్, వెంకటలక్ష్మి, జిల్లా నాయకులు రుత్తల ఎర్రాపాత్రుడు, రవిరెడ్డి, పక్కి దివాకర్, కిరణ్‌ రాజు, లాలం బాబ్జీ, గవిరెడ్డి నాని, రుత్తల సత్యనారాయణ, మళ్ల బుల్లిబాబు, భీశెట్టి జగన్, పో లిరెడ్డి లచ్చాధికారి, పైల నరేష్‌ పాల్గొన్నారు.

గ్రామాల్లో పండుగ వాతావరణం
‘రాజన్న బిడ్డ వస్తున్నాడు ఇంతకు మించి పండుగ ఏం ఉంటుంది’ అని తమ్మయ్య పాలెంలోని సూరయ్య అనడం విశేషం. అటువైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారంతా దిగిపోయి జననేతతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సైతం అభిమాన నేతను చూసేందుకు, మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంలో ఓ చిన్నారికి నామకరణం చేశారు.

వైఎస్‌ హయాంలోనే దివ్యాంగులకు న్యాయం
నాకు 72 శాతం అంగవైకల్యం ఉంది. 80 శాతం ఉంటేనే గాని దివ్యాంగులకు రూ.1500 పింఛన్‌ ఇస్తామంటున్నారు. ప్రస్తుతం వెయ్యిరూపాయలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో వైఎస్‌ హాయంలో 70 శాతం వైకల్యం ఉంటే చాలు దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్‌ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదు. మీరే న్యాయం చేయాలి బాబూ అంటూ జగన్‌ను కలిసి పెబ్బులి రాజబాబు విన్నవించుకున్నాడు.– పెబ్బులి రాజబాబు,సుబ్బారాయుడి పాలెం

ఆరోగ్యశ్రీ వర్తించలేదు
రెండు కాళ్లు వంకరగా ఉన్నాయి. ఆపరేషన్‌ చేసి సరిచేస్తామన్నా రు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతా య ని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకంలో ఆపరేషన్‌ చేయమంటే వర్తించదని వైద్యులు చెప్పారని సుబ్బారాయుడుపాలెంకు చెం దిన శివపార్వతి యామిని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చింది.     – శివపార్వతి యామిని,సుబ్బారాయుడి పాలెం

పింఛన్‌ ఇవ్వడంలేదు
నాకు చిన్నతనంలోనే పెళ్లయింది. కొద్ది నెలలకే భర్త చనిపోయాడు. నాకు పింఛన్‌ మంజూరు చేయమని కోరితే భర్త మరణ ధ్రువపత్రం తెచ్చుకోమంటున్నారు. నా భర్త పోయి సుమారు 40 ఏళ్లవుతోంది. ధ్రువపత్రం ఇప్పుడ ఎక్కడనుంచి తేవాలి. నాకు ఏ విధమైన ఆధారం లేదు. నాలాంటోళ్లను ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతోంది. మీరే నాకు ఉపకారం చేయాలి అంటూ పాదయాత్రలో జగన్‌కు చిటికెల గంగమ్మ మొరపెట్టుకుంది.– చిటికెల గంగయ్యమ్మ, వజ్రగడ

జగన్‌పైనే ఆశలు
గత 17 ఏళ్లుగా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ ప ద్ధతిలో పనిచేస్తున్నాం. అప్పటి నుంచి రేపోమాపో రెగ్యులర్‌ చేస్తారని ఆశతో ఉన్నాం. డీఎస్సీ అర్హత ఉండి రోస్టర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించి క్లియర్‌ వెకెన్సీలో భర్తీ చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వయసు మీదపడి మానసికంగా కుంగిపోతున్నాం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మమ్మల్ని రెగ్యులర్‌ చేస్తామని మాటిచ్చిన కొన్నాళ్లకే అకాల మరణం పొందారు.  జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక  మా ఉద్యోగాలు రెగ్యులర్‌ చేస్తారన్న కొండంత ఆశతో ఉన్నాం. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చాం.
–ఆర్‌.కృష్ణ, జి.జైకుమార్,పారామెడికల్‌ సిబ్బంది 

మరిన్ని వార్తలు