ఎన్నెన్నో వెతలు..

25 Jun, 2018 06:37 IST|Sakshi
వేగివారిపాలెం క్రాస్‌ వద్ద చిన్నారులను ఎత్తుకొని జగన్‌తో సెల్ఫీ దిగుతున్న తండ్రి

తూర్పుగోదావరి : తమకు బంగారు భవితను అందించ గలిగే ఆశాదీపం.. ఆర్తజన రక్షకుడు.. అడుగోజగనన్న.. జనచైతన్య తరంగమై వస్తున్నాడు. ఇదిగో ఇక్కడ నుంచైతే చక్కగా కనిపిస్తాడంటూ మేడలు, మిద్దెలపైనుంచి తిలకించే వారు. ఆయన చేయి తగిలితే చాలు.. ఒక్క సెల్ఫీ దిగితే చాలు.. అంటూ ఆశించే అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు.. ఆయనకు తమ గోడు వెళ్లబోసుకుంటే చాలు.. అవి నెరవేరతాయని ఆశించే ఆపన్నులు. తమ బిడ్డకు పేరుపెట్టాలని, అక్షరాభ్యాసం చేయాలని ఆకాంక్షించే తల్లిదండ్రులు.. ఇలా వివిధ వర్గాల వారికి అభయప్రదానం చేస్తూ.. వారి ఆకాంక్షలను తీరుస్తూ సాగుతున్నారు ప్రజాసంకల్పయాత్ర పథికుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జిల్లాలో పన్నెండో రోజుపాదయాత్ర రాజోలు నియోజకవర్గం ములికిపల్లిలో ప్రారంభమై పి. గన్నవరంనియోజకవర్గం నరం గ్రామంలో ముగిసింది.

ఉచితంగా వైద్యం చేయించండి– పెట్టా సత్యకుమారి, అంతర్వేదిపాలెం
‘గుండెకు సంబంధించిన వైద్యం హైదరాబాద్‌ నిమ్స్‌లో రాజన్న హయాంలో ఉచితంగా చేయించుకున్నా. ప్రస్తుతం నాకు హర్ట్‌లో హోల్‌ ఉంది. ఇప్పుడు వైద్యానికి వెళితే ఉచితంగా చేయడం లేదు’ అని జగన్‌ వద్ద అంతర్వేదిపాలేనికి చెందిన పెట్టా సత్యకుమారి వాపోయారు.   డబ్బులు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత తనకు లేదని, ఉచితంగా వైద్యం చేయించాలని జగన్‌
బాబును ఆమె కోరారు.

జగనన్నకు చిలపదండ వేశా
తూర్పుగోదావరి : జగనన్నకు నేను సొంతంగా తయారు చేసిన చిలపదండ వేయడం ఆనందంగా ఉందని జగన్నపేటకు చెందిన కందనాల కోటనాగరాజు తెలిపాడు. గ్రామానికి వచ్చిన జగన్‌ను కలిసి ఆయన మెడలో చిలపదండ వేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరానన్నారు.

మరిన్ని వార్తలు