విజయనగరం వీధుల్లో పోలీసు కవాతు

11 Oct, 2013 12:10 IST|Sakshi

విజయనగరం : విజయనగరంలో శుక్రవారం పోలీస్ కవాతు నిర్వహించారు. డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. గత నాలుగు రోజులుగా పట్టణంలో పరిస్థితులు పూర్తిగా పోలీసుల అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే  144 సెక్షన్ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా కోస్టల్ ఐజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రయివేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో అరెస్టులు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ 150మందిపై ప్రధాన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ల్లో రాజకీయ జోక్యం లేదని  ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.  కర్ఫ్యూ సడలింపు సమయంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన లు చేపట్టడానికి అంగీకరించబోమని అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని.... పరిస్థితిని బట్టి కర్ఫ్యూ ఎత్తివేస్తామన్నారు.

మరిన్ని వార్తలు