ఆందోళనకారులపై పోలీసులు దాడి చేయలేదు

6 Jan, 2020 14:08 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ఎలాంటి అనుమతులు లేవని గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. రాజధాని గ్రామాల్లో సెక్షన్‌30, యాక్ట్‌ 144 అమల్లో ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుంది కానీ ఎదుటివారికి ఇబ్బంది కల్పించే హక్కు లేదని పేర్కొన్నారు. రైతులు ప్రశాంతంగా నిరసన తెలిపినంత వరకు తాము వారిని అడ్డుకోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కులకు ఇబ్బంది కల్పించి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ఉద్దండ రాయునిపాలెంలో మీడియా ప్రతినిధులపై దాడి ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఆ సమయంలో పోలీసులు లేకుంటే ప్రాణ నష్టం జరిగేదన్నారు. మీడియాపై దాడి చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేశామని తెలిపారు. మందడంలో జరిగిన ఘటనలో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులే పోలీసులపైకి దాడికి దిగగా ముగ్గురు కానిస్టేబుల్స్‌ గాయపడ్డారని పేర్కొన్నారు.

వెంబడించి మరీ దాడి చేశారు: జర్నలిస్టులు

మరిన్ని వార్తలు