తప్పని సరైతేనే పోలింగ్ కేంద్రాల మార్పు

31 Jan, 2014 06:19 IST|Sakshi

 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు శాస్త్రీయంగా చేపట్టాలి
     సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
     ఫిబ్రవరి 1 నాటికి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సిద్ధం చేయాలి
     వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ సూచన
 
 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 పోలింగ్ కేంద్రాలను మార్చడం అంత సులువు కాదని, తప్పని సరైతేనే ఎన్నికల సంఘం అనుమతించదని, మార్పును కూడా శాస్త్రీయంగా చేపట్టాలని  కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్న పోలింగ్ కేంద్రాలు, అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ రంగనాథ్‌తో కలిసి గురువారం ఆయన ఆర్డీవోలు, డీఎస్పీలు, తహశీల్దార్లు, సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అంశాలపై రెవెన్యూ, పోలీస్ విభాగాలు ఇటీవల వేర్వేరుగా పంపిన నివేదికల్లో పలు అంశాల్లో తేడాలున్నాయని, వాస్తవ ఆధారాలు పంపాలని సూచించారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే కేంద్రాల గుర్తింపును శాస్త్రీయంగా చేపట్టాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నక్సల్స్ వల్ల శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే పోలింగ్ కేంద్రాలు, ఎలాంటి కమ్యూనికేషన్ లేనివి, పార్టీలు, కులాల మధ్య శత్రుత్వం అధికంగా ఉన్నవి, గత ఎన్నికల్లో ఒకే అభ్యర్థికి 75 శాతానికి పైగా పోలైన కేంద్రాలను గుర్తించి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఎన్నికలు  సజావుగా జరిగేలా మానవ వనరుల సర్దుబాటు, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ ప్రణాళికను రెవెన్యూ, పోలీస్ అధికారులు జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సౌకర్యాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా సిద్ధం చేసి ఫిబ్రవరి 1 లోగా అందించాలని ఆర్డీవోలకు సూచించారు. ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో ఉన్న మౌలిక సదుపాయాలను వీడియో ద్వారా చిత్రీకరించి, ఆ వివరాలను వెంటనే పంపాలన్నారు. జోనల్ రూట్ అధికారుల నియామకాన్ని సక్రమంగా చేపట్టాలన్నారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పోలింగ్ కేంద్రాల గుర్తింపులో వాస్తవికతకు పెద్ద పీట వేయాలని, నేరచరిత్ర ఉన్న వారిని మాత్రమే ఎన్నికల సమయంలో బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు పోలింగ్ కేంద్రాలు, ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేని మారుమూల పోలింగ్ కేంద్రాల మార్పునకు మాత్రమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, డీఆర్‌వో శివ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 గెజిటెడ్ అధికారుల వివరాలివ్వాలి..
 ఎన్నికల నిర్వహణకు గాను జోనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకానికి జిల్లాలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు తమ శాఖలోని గెజిటెడ్ అధికారుల వివరాలను నిర్దేశించిన ఫార్మాట్‌లో ఫిబ్రవరి1లోగా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సంఘం విధించిన నిబంధనల కారణంగా గెజిటెడ్ అధికారుల లభ్యత కొంత ఇబ్బందిగా ఉన్నా, వీలైనంత త్వరగా వారి వివరాలను పంపాలని సూచించారు.
 
 వివిధ విభాగాలకు నోడల్ అధికారులు వీరే..
 ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను వివిధ విభాగాలకు  జిల్లాలోని సీనియర్ ఆఫీసర్లను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆ వివరాలివి...
 
 

మరిన్ని వార్తలు