తిరుమల శ్రీవారికి అభిషేకం..

12 Jun, 2020 08:17 IST|Sakshi
(ఫైల్ ఫోటో)

సాక్షి, తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గురువారం నుంచి ప్రారంభం కాగా, నిన్న స్వామివారిని 6,998 మంది  భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. మొదటిరోజు దర్శనానికి ఎనిమిది రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేశారు. తెలంగాణ నుండి 143, త‌మిళ‌నాడు నుండి 141, క‌ర్ణాట‌క నుండి 151 మందితోపాటు మ‌హారాష్ట్ర‌, న్యూఢిల్లీ, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, ప‌శ్చిమ‌ బెంగాల్‌ ప్రాంతాల నుండి భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఉదయం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. గంటకు 500 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి భౌతిక దూరం తో పాటు, మాస్కులు తప్పనిసరిగా ధరించేవిధంగా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.

అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్‌ పరీక్షలు..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవకాశాన్ని బట్టి దర్శనాల టికెట్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాం‌డమ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సన్నిధి గొల్లలకు వంశపారంపర్యం కొనసాగిస్తూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.(తిరుమల శ్రీవారి దర్శనం ప్రారంభం)

మరిన్ని వార్తలు