ఇస్రోకు ప్రియదర్శిని అకాడమీ ‘గ్లోబల్ అవార్డు’

1 Oct, 2016 03:23 IST|Sakshi
ఇస్రోకు ప్రియదర్శిని అకాడమీ ‘గ్లోబల్ అవార్డు’

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ముంబైకి చెందిన ప్రియదర్శిని అకాడమీ ‘గ్లోబల్ అవార్డు’ను ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాలలో వరుస విజయాలు, ఏడాదికి ఐదారు ప్రయోగాలు, అత్యంత అధునాతనమైన సాంకేతికతను అందిస్తున్న కారణంగా ఇస్రోకు ఈ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన అకాడమీ 32వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.

గ్లోబల్ అవార్డు సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్‌ఏ మషిల్కర్, ప్రియదర్శిని అకాడమీ చైర్మన్ నిరంజన్ హీరానందిని, అకాడమీ ఎమిరిటస్ నానిక్ రూపాని నుంచి అవార్డును అందుకున్నట్టుగా ఇస్రో ప్రకటించింది. 1961లో ప్రారంభమైన ఇస్రో ప్రస్థానం నేడు సొంతంగా ఉపగ్రహాలు, రాకెట్లు తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి చేరింది.

>
మరిన్ని వార్తలు