పంజాగుట్టలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

8 Feb, 2014 11:41 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ పంజాగుట్టలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందంటూ పక్కా సమాచారం మేరకు పోలీసులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి భవనం మొదటి అంతస్తు పై నుంచి కిందకు దూకేసింది. దాంతో ఆమె తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 బాధితురాలు ముంబయికి చెందిన మోడల్గా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు  వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించటం వల్లే యువతి భవనం పై నుంచి దూకేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు