ఏపీ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలి : రాశి ఖన్నా

15 Dec, 2019 15:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ‘ ఏపీ దిశ యాక్ట్‌’కు హట్సాఫ్‌ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా చట్టం చాలా మంచిదని కొనియాడుతున్నారు. ఇలాంటి చట్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశం మొత్తం తీసుకురావాలని కోరుతున్నారు. 

(చదవండి : హ్యాట్సాఫ్‌ టు దిశ యాక్ట్‌)

తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా దిశ యాక్ట్‌పై  స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాల మంచిందని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుందన్నారు.  ఈ చట్టంతో తప్పు చెయ్యాలనుకునే వారు భయపడతారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశీ ఖన్నా పేర్కొన్నారు.

కాగా, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం-2019’ కు గత శుక్రవారం శాసస సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది.

>
మరిన్ని వార్తలు