నేటి సామాజిక సాధికార బస్సుయాత్ర షెడ్యూల్‌..

7 Dec, 2023 11:05 IST|Sakshi

శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర  జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగనుంది. ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది.

మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం ఉండనుంది. మడకశిర పట్టణం లోని సరస్వతి విద్యామందిరం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ బస్సుయాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర వైఎస్సార్ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు